కొడుకుని ఓల్డేజ్‌ హోమ్‌కి పంపిచేస్తా! | 102 Not Out Trailer Released | Sakshi
Sakshi News home page

కొడుకుని ఓల్డేజ్‌ హోమ్‌కి పంపిచేస్తా!

Published Thu, Mar 29 2018 12:48 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

102 Not Out Trailer Released - Sakshi

అమితాబచ్చన్‌,రిషీ కపూర్

మనకు ఒక వయసు వచ్చే వరకు మనకు కావల్సినవి, అవసరమైన వి అన్నీ మన తల్లిదండ్రులే సమకూరుస్తారు. అదే మనకు 70 ఏళ్లు వచ్చినా ఇంకా మన మంచి చెడ్డలూ చూస్తే? ఆ అవకాశం అందరికీ దక్కదు. రిషీ కపూర్‌కి ఆ చాన్స్‌ దక్కింది. అయితే రియల్‌ లైఫ్‌లో కాదు.  రిషీ కపూర్, అమితాబచ్చన్‌ 27 సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ‘102 నాటౌట్‌’. డాడ్‌ అండ్‌ సన్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్‌ 102 ఏళ్ల వృద్ధ తండ్రిగా, రిషీ కపూర్‌ ఆయన 75 ఏళ్ల కుమారుడిగా చేస్తున్నారు.

‘‘ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తాను. ఈ ముసలి కుమారుడితో ఉండలేకపోతున్నాను ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో చేరుస్తాను’’ అంటూ సాగే ‘102’ ట్రైలర్‌ ఆకట్టుకునే విధంగా ఉంది.  సౌమ్య జోషి రచించిన ఈ చిత్రాన్ని ‘ఓ మై గాడ్‌’ ఫేమ్‌ ఉమేశ్‌ శుక్లా దర్శకత్వం వహించారు. ట్రీటాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్, బెంచ్‌మార్క్‌ పిక్చర్స్, సోనీ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 4న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement