
అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్
‘102 నాటౌట్’.. ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ. ఎందుకింత మోస్ట్ ఎగై్జటెడ్ మూవీ అంటే ఆల్మోస్ట్ 27 ఏళ్ల తర్వాత అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్ కలిసి నటిస్తుండటం విశేషం. ‘అమర్ అక్బర్ ఆంటోనీ, కూలీ, అజూబా’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కనిపించారు అమితాబ్, రిషీ. 1977లో రిలీజ్ అయిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో అన్నదమ్ములుగా కనిపించారు అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్. 40 ఇయర్స్ తర్వాత, లేటెస్ట్ సినిమా ‘102 నాటౌట్’లో తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో 102 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నారు అమితాబ్. ‘ఓ మై గాడ్’ ఫేమ్ ఉమేశ్ శుక్లా ఈ సినిమాకు దర్శకుడు. ఇదో లవ్ స్టోరీ. ఫాదర్ అండ్ సన్ మధ్య లవ్‌స్టోరీ. చురుకైన వృద్ధుడిగా అమితాబ్, వయసైపోయిన కుమారుడిగా రిషీ కపూర్ కనిపించనున్నారు. తెల్లటి గడ్డంతో అమితాబ్ మరింత హుషారుగా కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ‘‘ప్రపంచంలో కొడుకుని వృద్ధాశ్రమంలో చేర్చిన ఫస్ట్ తండ్రిని నేనే అవుతానేమో’’ అని టీజర్‌లో ఉన్న డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా మే 4న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment