రాజ్‌కుమార్ హిరానీకి గాయాలు
ప్రముఖ హిందీ చలనచిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీకి యాక్సిడెంట్ అయింది. మోటార్‌సైకిల్ మీద నుంచి కిందపడిపోవడంతో మంగళవారం ఉదయం ఆయన గాయాల పాలయ్యారు. ఆయన ముఖం మీద దవడ భాగంలో గాయమైంది. ముంబయ్‌లోని బంద్రా ప్రాంతంలోని ప్రసిద్ధ లీలావతీ హాస్పిటల్‌లో చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. డాక్టర్లు ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నట్లు సమాచారం. మోటార్ సైకిల్ ప్రమాదంలో హిరానీకి గడ్డం దగ్గర గాయాలయ్యాయి. అలాగే, కింద దవడ భాగం దగ్గర ఎముక విరిగినట్లు అనుమానిస్తున్నారు. సంజయ్ దత్ హీరోగా ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ చిత్రం తీసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు హిరానీ.
ఆ తరువాత సంజయ్ దత్‌తోనే ‘లగేరహో మున్నాభాయ్’ లాంటి చిత్రాలు రాజ్‌కుమార్ హిరానీకి మంచి పేరు తెచ్చాయి. ఆమిర్‌ఖాన్‌తో ఆయన తీసిన ‘3 ఇడియట్స్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. గత ఏడాది చివరలో వచ్చిన ‘పీకే’ సైతం హయ్యస్ట్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది.