భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(42)కి గుండెపోటు రావడంతో అతడిని లీలావతి ఆస్పత్రికి తరలించారు.
ముంబై: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(42)కి గుండెపోటు రావడంతో అతడిని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం కారులో చెంబుర్ నుంచి బాంద్రాకు వెళుతున్న కాంబ్లీకి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే గుర్తించిన మహిళా ట్రాఫిక్ అధికారి ఒకరు.. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ఇంకా సమాచారం వెలువరించలేదు.
గతేడాది జూలైలో వినోద్ కాంబ్లీ యాంజియోప్లాస్ట్ ఆపరేషన్ చేయింకున్నాడు. చిన్ననాటి స్నేహితుడైన సచిన్ టెండూల్కర్ తనను దూరం పెట్టడంతో కాంబ్లీ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశాడు. సచిన్ రిటైర్మెంట్ కు తనను పిలవకపోవడంతో కలత చెందాడు. మైదానంలోనూ, బయట వివాదాస్పదుడిగా ముద్రపడిన కాంబ్లీ భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు.