
ఆస్పత్రిలో శివసేన చీఫ్
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే బుధవారం ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో ఆయన చేరారని, ఈరోజే డిశ్చార్జ్ చేసే అవకాశముందని శివసేన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన పడొద్దని కోరారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు.
థాకరేకు గుండె, కాలేయ సంబంధ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఇదే ఆస్పత్రిలో ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఈ సాయంత్రం ఆయనను డిశ్చార్జ్ చేస్తామని లీలావతి ఆస్పత్రి ఆపరేషన్స్ అండ్ సప్లై డైరెక్టర్ అజయ్ కుమార్ పాండే తెలిపారు.