మనోహర్ పారికర్, గోవా ముఖ్యమంత్రి (ఫైల్ ఫొటో)
సాక్షి, పనాజీ : అవసరం అయితే మెరుగైన వైద్యం కోసం గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను అమెరికా తరలిస్తామని బీజేపీ నేత, గోవా డిప్యూటీ స్పీకర్ మైఖెల్ లాబో చెప్పారు. క్లోమం (ప్యాంక్రియాస్) సంబంధించిన సమస్య ఏర్పడిన కారణంగా కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన పారికర్ ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా ఆయనను పరామర్శించి రావడంతో అంతలా పారికర్‌కు ఏమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
అయితే, వాటన్నింటిని ఆస్పత్రి వర్గాలు కొట్టి పారేశాయి. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మైకెల్ కూడా సోమవారం ఓ ప్రకటన చేశారు. 'ఆయన మాకు కావాలి. మేం చేయగలిగిందంతా చేస్తాం. అవసరం అయితే, ఆయనను అమెరికాకు కూడా తరలిస్తాం' అని మీడియా ప్రతినిధులతో అసెంబ్లీ ప్రాంగణంలో చెప్పారు. ప్యాంక్రియాస్‌కు సంబంధించిన సమస్య కారణంగా పారికర్ ఈ నెల (ఫిబ్రవరి) 15న లీలావతి ఆస్పత్రిలో చేరి వైద్యంసేవలు పొందుతున్నారు. ఆయనకు ఓ సర్జరీ కూడా చేయగా ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే చెప్పాయి.
Comments
Please login to add a commentAdd a comment