
సాక్షి, విజయవాడ: తనూజ మృతి కేసులో విజయవాడ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం తనూజపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, యాక్సిడెంట్‌గా నిర్ధారించారు. తనూజను గుంటూరు నుంచి కుంచనపల్లి వద్ద ఆమె స్నేహితుడు దింపి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆమె మృతికి.. స్నేహితుడికి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు.
కుంచనపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగితే ఎవరైనా శిఖామణి సెంటర్‌కు తీసుకువచ్చారా.. లేదా శిఖామణి సెంటర్‌లో యాక్సిడెంట్ జరిగిందా, ఇక్కడకు ఎందుకు వచ్చింది అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కుంచనపల్లి వద్ద సీసీ పుటేజ్‌ను సేకరించారు. తనూజ పోస్టుమార్టం రిపోర్టులో బలమైన వాహనం వేగంగా గుద్దినట్లు తేలింది. శరీరంలో పలుచోట్ల, ఇంటర్నల్ గాయాలు, బ్లీడింగ్ కూడా అవుతున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా, మృతురాలి కుటుంబ సభ్యులు తనూజ మృతిపై ఎవరిపైనా తమకు ఎలాంటి అనుమానం లేదని చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment