
కిలికిలి భాష గుర్తుందా! అదేనండీ... ‘బాహుబలి’ సినిమాలో కాలకేయులు మాట్లాడారు కదా! ‘బాహుబలి’ మానియా టైమ్‌లో కిలికిలి భాష గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు భల్లాలదేవుడు.. అదేనండీ హీరో రానా మరో భాషపై కాన్సంట్రేట్ చేశారు. కానీ, ఇది మనుషులు మాట్లాడుకునేది కాదట. మరైతే.. ఏమై ఉంటుంది? అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాం. ప్రకృతి భాష అట! ఏనుగులతో మాట్లాడేందుకు ప్రిపేర్ అవుతున్నారు రానా. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రానా హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఈ సినిమాకు హిందీలో ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హాథీ మేరే సాథీ అంటే ఏనుగుతో సహచర్యం అని అర్థం. 1971లో రాజేష్ ఖన్నా, తనుజా జంటగా వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ చిత్రానికి ఇది రీమేక్ అట. ‘‘హాథీ మేరే సాథీ’ చిత్రంలో నటించబోతున్నాను. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించడం నాకిష్టం.. ఒక మనిషికి, ఏనుగుకి మధ్య ఉండే చక్కని రిలేషన్‌షిప్ నేపథ్యంలో సాగే కథ. ప్రభు సాల్మన్ కథ చెప్పేటప్పుడు నేచర్‌పై అతనికి ఉన్న ఇంట్రెస్ట్ తెలిసింది’’ అని పేర్కొన్నారు రానా. హాలీవుడ్ మూవీ ‘టార్జాన్’ సిరీస్‌లో హీరో ఏనుగుతోనూ దోస్తీ చేస్తాడు. మన టార్జాన్ (రానా) కూడా ఇప్పుడు చేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment