బాలీవుడ్ క్లాసిక్ రీమేక్ లో రానా | Rana Daggubatis New Film Haathi Mere Saathi | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 14 2017 10:52 AM | Last Updated on Thu, Dec 14 2017 10:52 AM

Rana Daggubatis New Film Haathi Mere Saathi - Sakshi

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. ఇమేజ్ చట్రంలో ఇరుక‍్కుపోకుండా విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యువ నటుడు రానా. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రానా ఇటీవల నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సోలో హీరోగా కూడా ఘనవిజయం సాధించాడు. బహుభాషా నటుడిగా గుర్తింపు రావటంతో రానా కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమాలన్ని మూడు నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి.

1945 పేరు తో తెరకెక్కుతున్న పీరియాడిక్ సినిమాలో నటిస్తున్న రానా.. ఆ సినిమా తరువాత ఓ బాలీవుడ్ క్లాసిక్ ను రీమేక్ చేయనున్నాడు. 1971లో రాజేష్ ఖన్నా హీరోగా తెరకెక్కిన ‘హాథీ మేరే సాథీ’  సినిమాను రానా హీరోగా రీమేక్ చేయనున్నారు. ఈసినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా పీరియాడిక్ జానర్ లోనే తెరకెక్కుతోంది. ఈ రోజు (గురువారం) రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ ను న్యూ ఇయర్ కానుక 2018 జనవరి 1న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు రానా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement