న్యూఢిల్లీ:'దానా' తుఫాను ఒడిశా తీరం దాటిన నేపధ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పరిస్థితిని సమీక్షించారు. ఇకపై రాష్ట్రం సురక్షితమని, అధికారుల టీమ్ వర్క్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.
విలేకరుల సమావేశంలో సీఎం మాఝీ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ‘ఒడిశా ఇప్పుడు సురక్షితంగా ఉంది. తుఫాను తాకిడి తరువాత, పరిస్థితిని సమీక్షించాము. అధికారుల సమిష్టి కృషి కారణంగా, ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మేము ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. సహాయ కేంద్రాల్లో వారికి వసతి కల్పించాం. విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. 1.75 లక్షల హెక్టార్లలో పంటలు నాశనమైనమయ్యాయి. బుధబలంగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది’ అని పేర్కొన్నారు.
The deep depression (remnant of severe cyclonic storm “DANA”) over north Odisha remained practically stationary during past 6 hours, weakened into a Depression over the same region and lay centred at 2330 hrs IST of yesterday, the 25th October near latitude 21.4°N and longitude… pic.twitter.com/Bb7LrXjHTT
— India Meteorological Department (@Indiametdept) October 25, 2024
'దానా' తుఫాను గంటకు ఏడు కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ ఒక పోస్ట్‌లో ఒకటి తెలిపింది. ఇది ఉత్తర ఒడిశా మీదుగా పశ్చిమ దిశలో పయనించి, రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ప్రభావం గురించి భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సోమనాథ్ దత్తా మాట్లాడుతూ ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తుపాను ప్రభావం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇది కూడా చదవండి: అందరి చూపు షిల్లాంగ్ వైపే
Comments
Please login to add a commentAdd a comment