
మోహన్ గీతలు డామినేట్ చేయడంవల్ల రాతల గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడరు. ఆయనకో విలక్షణమైన శైలి ఉంది. వాక్యాలు పదునుగా ఉంటాయి.
కమ్యూనిస్టు భావాలున్న కార్టూనిస్టుగా, మంచి రాత గీత ఉన్న జర్నలిస్ట్‌గా, అన్నిటికీ మించి మంచి స్నేహ శీలిగా మోహన్ కలకాలం గుర్తుంటారు. మోహన్ రేఖలు వేటకొడవళ్లలా నిగ్గుతేలి ఉంటాయి. శషబిషలు లేని సూటి విసుర్లతో కార్టూన్లు సృష్టించి అనేకమంది అభిమా నులను, కొద్దిమంది శత్రువులను సంపాయించుకు న్నారు. మోహన్ గీతలు డామినేట్ చేయడంవల్ల రాతల గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడరు. ఆయనకో విలక్ష ణమైన శైలి ఉంది. వాక్యాలు పదునుగా ఉంటాయి. ప్రపంచంలోని వివిధ కళా రీతుల్ని ఆయన అధ్యయనం చేశారు. మోహన్ అక్షరాలను తెలుగువారు ఇట్టే గుర్తించగలరు. ఆయనకి ‘‘శిష్య కోటి’’ ఉంది.
హైదరాబాద్‌లో ‘‘నీహార్ ఆన్ లైన్’’ పోర్టల్ ప్రారంభించినపుడు దాంట్లో ‘‘సరసమ్ డాట్‌కామ్’’ ప్రత్యేక హాస్య విభాగాన్ని పెట్టారు. వారం వారం పాతిక వెబ్ పేజీలు నేను హాస్యంగా, వ్యంగ్యంగా, సర సంగా రాస్తే దానికి మోహన్ క్యారి కేచర్లు, కార్టూన్లు సమకూర్చి నిండు తనం తెచ్చేవారు. రెండు సంవత్స రాలు నిరాఘాటంగా, 66 దేశాలలో లక్షలాది క్లిక్స్‌తో నడిచింది సరసమ్. మోహన్ తన కెరియర్‌లో సంతృప్తినిచ్చిన సందర్భంగా చెప్పేవారు. వాటిలోంచి వాచవిగా కొన్ని:
ఆంధ్రజ్యోతిలో చిలకలపందిరి కూడా మా కాంబినేషన్‌లో బానే సందడి చేసింది. నేనంటే ఆయనకు వల్లమాలిన ఇష్టం. నా వెంకట సత్య స్టాలిన్‌కి బొమ్మలు వేసిచ్చారు. పుస్తకం తేవాలి. మోహన్ సరసమ్ డాట్‌కామ్‌ని ఆరు సంపుటాలుగా సర్వాంగ సుందరంగా తేవాలని ముచ్చట పడ్డారు. చాలా బొమ్మలు మళ్లీ గీశారు కూడా. కొన్ని అనుకున్నట్టు జరగవ్. అంతే. సృజనశీలికి, సన్మిత్రునికి నివాళి.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ