జో శర్మ, సంబీత్ ఆచార్య జంటగా నటిస్తోన్న చిత్రం 'ఎంఫోర్ఎం'. ఈ చిత్రానికి మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు డైరెక్టర్ తెలిపారు. సినీ చరిత్రలో ఇప్పటివరకు రానీ కాన్సెప్టుతో ఈ సినిమా చేసినట్లు వెల్లడించారు. రాబోయే పదేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారనే నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ.. 'ఇటీవల హిందీ ట్రైలర్ గోవా ఫిలిం ఫెస్టివల్‌లో విడుదల చేశాం. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మా సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాం. హీరోయిన్ జో శర్మ తన ఫర్మార్మెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించాం. కథ, కథనాలను నమ్ముకునే సినిమా తీశాం. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే చూసి ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కోక్కరికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
కాగా.. ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ, ఎంఆర్సీ వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి వసంత్ సంగీతమందిస్తున్నారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment