
మోహన్, సంజనా నాయుడు
మోహన్, సంజనా నాయుడు, రాజ్‌కాంత్, గీత్‌షా ముఖ్య తారలుగా మన్యం శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తాంత్రిక’. సంగకుమార స్వామి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సంగకుమార స్వామి మాట్లాడుతూ– ‘‘వినోదం, హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. గ్రాఫిక్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఇందులో రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది. మా సినిమా యువతను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
‘‘వరుసగా సినిమాల్ని నిర్మిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు సంగకుమార్. ఈ సినిమా హిట్ అయి ఆయనకు డబ్బులు తీసుకురావాలి’’ అన్నారు నిర్మాత సాయి వెంకట్. ‘‘రొమాంటిక్ థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది’’ అన్నారు రాజ్‌కాంత్. ‘‘కన్నడలో 8 సినిమాలు చేశా. కథా బలమున్న ‘తాంత్రిక’ సినిమాతో తెలుగుకి పరిచయం కావడం హ్యాపీ’’ అన్నారు సంజనా నాయుడు.
Comments
Please login to add a commentAdd a comment