సాక్షి, ముంబై: శివసేనకు చెందిన మాజీ కార్పొరేటర్ రామచంద్ర రావుత్ హత్య కేసులో నిందితుడి గా ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగేశ్‌రావుత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బదలాపూర్ ఎన్సీపీ ఉపాధ్యక్షుడిగా యోగేశ్‌రావుత్ కొనసాగుతున్నారు. కాగా రామచంద్రను మార్చి 23న గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన యోగేశ్‌రావుత్ ఆఫీసులోనే జరిగింది. మోహన్, యోగేష్‌ల మధ్య వ్యాపార వ్యవహారాల విషయమై గొడవ జరిగిందని, అది మనసులో పెట్టుకొని మోహన్‌ను యోగేశ్ చంపించాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు క్రైంబ్రాంచి పోలీసులు తెలిపారు.