
ఇండస్ట్రీలో హిట్ వస్తేనే అవకాశాలు వస్తాయి. కొంచెం గ్యాప్ వచ్చినా అంతే సంగతి ఇక. కానీ మూడేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చి.. వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది ఓ హీరోయిన్. ఆమే ప్రియాంక మోహన్

గ్యాంగ్‌లీడర్ చిత్రంలో టాలీవుడ్ ఇచ్చించి ప్రియాంక. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

దీంతో ప్రియాంక కోలీవుడ్‌కి షిఫ్ట్ అయింది. అక్కడ ఆమె నటించిన డాక్టర్, డాన్ లాంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. సూర్య, ధనుష్ లాంటి హీరోలతో నటించింది.

తెలుగులో కూడా రాణించాలని ప్రియాంక భావించింది. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ ఓజీలో నటించే అవకాశం వచ్చింది.

ఓజీ షూటింగ్ వాయిదా పడడంతో ప్రియాంకకు మళ్లీ ఇక్కడ చాన్స్ రాలేదు.

అయితే అంతకు ముందే ప్రియాంక సరిపోదా శనివారం సినిమా ఒప్పుకుంది. అది ఇటీవల విడుదలై మంచి విజయం సాధించడంతో ప్రియాంకకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ, విశ్వక్ సేన్ సినిమాలో ప్రియాంకనే హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంతో పాటు మరో స్టార్ హీరో మూవీలోకూడా ప్రియాంక నటించబోతున్నారట. మూడేళ్లు గ్యాప్ వచ్చినా..

ఇప్పుడు వరుస చాన్స్ రావడం నిజంగా ప్రియాంక మోహన్ అదృష్టమే. ఓజీతో పాటు ఈ రెండు చిత్రాలు హిట్టయితే.. ప్రియాంక స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోనట్లేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













