మనసుకి ఏమైందిరా... | Emi Sodara Manasuku Emaindi Ra Movie Opening | Sakshi
Sakshi News home page

మనసుకి ఏమైందిరా...

Sep 24 2016 12:30 AM | Updated on Sep 4 2017 2:40 PM

మనసుకి ఏమైందిరా...

మనసుకి ఏమైందిరా...

‘ఏమి సోదరా.. మనసుకేమైందిరా...’ అంటూ తొలిప్రేమ చిత్రంలో పవన్ కల్యాణ్ పాడుకుంటారు. అప్పట్లో ఆ పాట యువతరాన్ని ఒక ఊపు ఊపేసింది.

‘ఏమి సోదరా.. మనసుకేమైందిరా...’ అంటూ తొలిప్రేమ చిత్రంలో పవన్ కల్యాణ్ పాడుకుంటారు. అప్పట్లో ఆ పాట యువతరాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ‘ఏమి సోదరా.. మనసుకేమైందిరా...’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కల్యాణ్, హనీగుప్త, మోహన్ వత్స, ఉపాసన ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ నేదునూని దర్శకత్వంలో జేవీఆర్ సినిమాస్, వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై జేవీఆర్, దేశ్‌ముఖి రాజు యాదవ్, శ్రీనివాస్ నేదునూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. తెలంగాణ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి క్లాప్ ఇచ్చారు.
 
 దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యమధర్మ రాజు, చిత్రగుప్తుడు పాత్రలతో పాటు  ప్రేమ గురించి ఈ చిత్రంలో చూపిస్తున్నాం. వినోదాత్మకంగా తీర్చిదిద్దుతాం. అందరూ కొత్తవాళ్లు నటిస్తున్న ఈ చిత్రంలో హీరోల్లో ఒకరైన శరత్ కల్యాణ్ వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు’’ అని చెప్పారు. ‘‘మంచి కథ కుదిరింది. టైటిల్ అందరికీ నచ్చింది’’ అని నిర్మాతలు అన్నారు. హీరో, హీరోయిన్లు, నటులు కృష్ణుడు, తాగుబోతు రమేశ్, భోజ్‌పురి నటి రాణీ ఛటర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మెలోడి శ్రీనివాస్, కెమెరా: మురళీ కృష్ణ, సహ నిర్మాత: పైల నర్సింహరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement