సాక్షి, చెన్నై : కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ సీనియర్ కమెడియన్ క్రేజీ మోహన్(67) గుండెపోటుతో చెన్నైలో ఈరోజు(సోమవారం) తుదిశ్వాస విడిచారు. ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో దగ్గరలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు కాపాడటానికి చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. అపూర్వ సహోదరులు, మైకేల్ మదన కామరాజు, సతీలీలావతి, తెనాలి, పంచతంత్రం, కాదల కాదల, భామనే సత్యభామనే, వసూల్ రాజా ఎం.బి.బి.ఎస్ తదితర చిత్రాల్లో కామెడీ పాత్రలతో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. `క్రేజీ తీవ్స్ ఇన్ పాలవాక్కం` అనే నాటకం తర్వాత ఈయనకు క్రేజీ మోహన్ అనే పేరు వచ్చింది. ఇంజనీరింగ్ చదివేరోజుల్లోనే నాటకాలకు స్క్రిప్ట్స్ రాసేవారు. క్రేజీ మోహన్ సోదరుడు మధు బాలాజీ నాటక కంపెనీకి స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన `పొయ్‌కల్ కుదరై` సినిమాతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment