Veteran Malayalam actor Mamukkoya passes away at 77 - Sakshi
Sakshi News home page

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

Published Wed, Apr 26 2023 4:32 PM | Last Updated on Wed, Apr 26 2023 4:58 PM

Veteran Malayalam actor Mamukkoya passes away at 77 - Sakshi

సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ నటుడు, కమెడియన్ మముక్కోయ(77) కన్నుమూశారు. కేరళలోని కోజికోడ్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి మలప్పురం జిల్లాలోని ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక ఇవాళ మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై ట్వీట్ చేశారు.

(ఇది చదవండి:  సమంత డై హార్డ్ ఫ్యాన్‌.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేస్తున్నాడు!)

మలయాళ చిత్రసీమలో అత్యుత్తమ హాస్య నటులలో ఒకరిగా పేరు మాముక్కోయ సంపాదించారు. 1979లో థియేటర్‌లో తన నటనా వృత్తిని ప్రారంభించిన ఆయన 450కి పైగా మలయాళ చిత్రాలలో నటించారు. మాముకోయ నటనకు రెండు రాష్ట్ర అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆయన ఎక్కువగా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించారు. తెలుగులో డబ్ అయిన దుల్కర్ సల్మాన్ నటించిన జనతా హోటల్, మోహన్‌ లాల్ నటించిన కనుపాప చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement