
సాక్షి, విజయనగరం : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని బాబామెట్ట పాంత్రంలో జరిగింది. బాబామెట్ట ప్రాంతానికి చెందిన మోహన్ చీపురుపల్లి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న(ఆదివారం) ఆయన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత‍్రం జరగనున్న రిసెప్షన్ పనుల్లో కుటుంబీకులు బిజీగా ఉండగా.. ఏమైందో ఏమో కానీ మోహన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహమైన అయిన రెండో రోజే నవవరుడు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. మోహన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment