New groom suicide
-
మధ్యాహ్నం పెళ్లి .. అర్ధరాత్రి వరుడి ఆత్మహత్య
శాంతినగర్ (అలంపూర్): వివాహమైన రోజు రాత్రే వరుడు ఆత్మహత్యకు పాల్పడటం.. జోగుళాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించింది. పెళ్లికూతురు పుస్తెలతాడు, మెట్టెలు, పెళ్లిచీర వదిలేసి పుట్టినింటికి వెళ్లిపోవడంతో వరుడి కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వడ్డేపల్లి మండలం తనగలకు చెందిన సూర్యబాబు (24), అయిజ మండలం సంకాపురానికి చెందిన యువతితో వివాహం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. కాగా ఆరోజు రాత్రి వరుడు, వధువు ఒకే గదిలో నిద్రించేందుకు వెళ్లారు. ఆ తర్వాత ఏమి జరిగిందో గానీ సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అత్తమామల వద్దకు వచ్చిన ఆమె.. ‘మీ కొడుకు అగుపిస్తలేడు..’అని చెప్పింది. వారు ఇంటి పరిసరాలను పరిశీలించగా పక్కగదిలో సూర్యబాబు ఉరేసుకుని చనిపోయి కన్పించాడు. వెంటనే పుట్టినింటికి సమాచారం అందించిన పెళ్లికూతురు తమ వారు తీసుకొచ్చిన వాహనంలో స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఈ విషయమై సూర్యబాబు కుటుంబసభ్యులు శాంతినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ శ్రీహరి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యబాబు మృతదేహానికి అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. సాయంత్రం తనగలలో అతని అంత్యక్రియలు నిర్వహించారు. -
మొదటి రాత్రే ఉరివేసుకున్న వరుడు
సాక్షి, శాలిగౌరారం(నల్గొండ): పెళ్లయిన 11 రోజులకు.. మొదటి రాత్రే వరుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గోళ్ల అంతమ్మ చిన్నకుమారుడు సోమేశ్ అలియాస్ సోమయ్య (27)కు ఈనెల 3న నాగారం మండలం ఫణిగిరికి చెందిన మేనమామ కూతురుతో వివాహమైంది. అనంతరం సంప్రదాయానుసారం 11వ రోజున మొదటిరాత్రికి మంగళవారం రాత్రి అన్ని ఏర్పాట్లు చేశారు. అంతలో సోమేశ్ తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అన్న ఫోన్ చేయగా సోమేశ్ ఫోన్ ఎత్తలేదు. అంతలో అతని స్నేహితులు రాత్రయిందంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. చదవండి: ఏడేళ్ల బాలికపై బాలుడి లైంగికదాడి.. గోళ్ల సోమేశ్ (ఫైల్ ఫొటో) సోమేశ్ కూడా ఇంటికి వెళ్తున్నానని చెప్పి, గ్రామంలో నిరుపయోగంగా ఉన్న పూరింట్లోకి వెళ్లి తాడుతో వెన్నుకర్రకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోపక్క సోమేశ్ కోసం బంధువులు ఫోన్లో ప్రయత్నిస్తూనే రాత్రంతా ఎదురుచూశారు. బుధవారం తెల్లవారుజామున అతడి స్నేహితులను వాకబు చేయగా ఇంటికి వెళ్తున్నానని చెప్పాడని తెలిపారు. దీంతో చుట్టుపక్కల గాలించగా, పూరి గుడిసెలో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. మృతుడి తల్లి అంతమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘నేను ఎవరికీ ఇష్టం లేదు.. బతకాలని లేదు’ చెట్టును ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి జోగిపేట(అందోల్): సింగూర్ ప్రాజెక్టు చూసేందుకు వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన మహ్మద్ అబ్దుల్ గఫార్ కుమారులు ఎండీ అబ్దుల్ సమీర్ (18), ఎండీ అబ్దుల్ జమీర్ (16)లతో పాటు గఫార్ అక్క కొడుకైన తోఫిక్ (18)లు మంగళవారం సింగూరు ప్రాజెక్టు చూసేందుకు తమ బంధువు బైకుపై (టీఎస్ 13 ఈఎన్ 0722) బయలుదేరారు. రెండు నిమిషాల్లో ప్రాజెక్టు వద్దకు చేరుకుంటామనే సమయంలో మూలమలుపు వద్ద బైకు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్‌లో సంగారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా.. బైక్ నడిపిన తోఫిక్‌తో పాటు అబ్దుల్ సమీర్ మృతి చెందాడు. గాయపడ్డ జమీర్‌ను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా అతను కూడా మరణించాడు. సమాచారం తెలిసిన వెంటనే అంబులెన్స్ క్షణాల్లో చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. దీంతో యువకుల ప్రమాదం సంఘటన.. మృతి చెందారన్న వార్త బుధవారం వరకు బయటకు తెలియలేదు. సింగూరులో జరిగిన విందుకు హాజరైన అనంతరం డ్యాం వద్దకు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లుగా ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
రిసెప్షన్ రోజే నవవరుడు ఆత్మహత్య
సాక్షి, విజయనగరం : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని బాబామెట్ట పాంత్రంలో జరిగింది. బాబామెట్ట ప్రాంతానికి చెందిన మోహన్ చీపురుపల్లి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న(ఆదివారం) ఆయన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం సాయంత్రం జరగనున్న రిసెప్షన్ పనుల్లో కుటుంబీకులు బిజీగా ఉండగా.. ఏమైందో ఏమో కానీ మోహన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహమైన అయిన రెండో రోజే నవవరుడు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. మోహన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లయిన నాలుగు రోజులకే..
హైదరాబాద్, నాగోలు: వివాహం జరిగి నాలుగు రోజులు గడవక ముందే ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, వాయిల్లపల్లికి చెందిన నాగరాజు (29) ఎల్బీనగర్ సూర్యోదయకాలనీలో ఉంటూ నాదర్గుల్లోని స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 6న అతడి వివాహం జరిగింది.. మంగళవారం డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం భువనగిరికి వెళ్లిన అతను చీకటి పడటంతో సూర్యోదయకాలనీలోని తన గదికి వచ్చాడు. సమీపంలోనే ఉండే అతని సోదరుడు లింగస్వామి కూడా నాగరాజు గదికి వచ్చి అతనితో పాటే ఉన్నాడు. బుధవారం లింగస్వామి డ్యూటీకి వెళ్లిపోగా, నాగరాజు 8.30కు తండ్రికి ఫోన్ చేసి తన భార్యను పుట్టింటి నుంచి తీసుకొచ్చేందుకు తనతో పాటు వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి తండ్రి నాగరాజుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అన్నకు ఫోన్ చేశాడు. లింగస్వామి సమీపంలో ఉంటున్న కిరాణ దుకాణం వారికి ఫోన్ చేయగా వారు గది వద్దకు వెళ్ళి నాగరాజును పిలువగా అతను తలుపులు తెరవకపోవడంతో ఇంటి యజమానికి చెప్పారు. గది తలుపులు పగులగొట్టి చూసేసరికి నాగరాజు స్పృహ తప్పి ఉండటంతో 108కు ఫోన్ చేశారు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
పెళ్లైన రెండో రోజే నవవరుడు ఆత్మహత్య!
కడియం : తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడియం మండలం మురమండలో జరిగింది. మురమండ గ్రామానికి చెందిన బంటు శ్రీనివాసరావు (27) అనే యువకుడు మహబూబాబాద్‌లో స్వీట్‌స్టాల్ నిర్వహిస్తున్నాడు. అతడికి ఈనెల 2వ తేదీన వివాహం జరిగింది. 3వ తేదీన నూతన వధూవరులు అన్నవరం దైవదర్శనానికి కూడా వెళ్లి వచ్చారు. అయితే శనివారం తెల్లవారుజామున నవ వరుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. శ్రీనివాస్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి తండ్రి బంటు చిన్నబ్బాయి ఫిర్యాదు మేరకు కడియం ఎస్ఐ ఎల్. గౌరీనాయుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అతని మృతిపై విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.