పెళ్లైన రెండో రోజే నవవరుడు ఆత్మహత్య! | New groom srinivasa rao suicide in east godavari district kadiyam | Sakshi
Sakshi News home page

పెళ్లైన రెండో రోజే నవవరుడు ఆత్మహత్య!

Published Sun, Feb 5 2017 9:05 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM

పెళ్లైన రెండో రోజే నవవరుడు ఆత్మహత్య! - Sakshi

పెళ్లైన రెండో రోజే నవవరుడు ఆత్మహత్య!

కడియం : తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడియం మండలం మురమండలో జరిగింది.

మురమండ గ్రామానికి చెందిన బంటు శ్రీనివాసరావు (27) అనే యువకుడు మహబూబాబాద్‌లో స్వీట్‌స్టాల్‌ నిర్వహిస్తున్నాడు. అతడికి ఈనెల 2వ తేదీన వివాహం జరిగింది. 3వ తేదీన నూతన వధూవరులు అన్నవరం దైవదర్శనానికి కూడా వెళ్లి వచ్చారు. అయితే శనివారం తెల్లవారుజామున నవ వరుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. శ్రీనివాస్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి తండ్రి బంటు చిన్నబ్బాయి ఫిర్యాదు మేరకు కడియం ఎస్‌ఐ ఎల్‌. గౌరీనాయుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అతని మృతిపై  విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement