
సాక్షి,వరంగల్ జిల్లా: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. శనివారం(అక్టోబర్ 26) స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ ఫిరాయించిన వారిని కేటీఆర్ రాజకీయ వ్యభిచారి అనడం సిగ్గుచేటు. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చిన తర్వాత ఎందరో పార్టీ మారారు. పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పులకు కట్టుబడి ఉంటాం.
కేటీఆర్ అహంకార, బలుపు వ్యాఖ్యలు సహించేది లేదు. 2014 ముందు నీ ఆస్తులు ఎంత,ఇప్పుడు ఆస్తులు ఎంతో ప్రజలకు చెప్పాలి. గురివింద గింజ కింద నలుపు ఎరుగది అన్నట్లు కేటీఆర్ మాట్లాడడం విడ్డూరం. 2014లో పార్టీ మారిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వలేదా. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదా. పార్టీ ఫిరాయింపులకు తెర లేపిందే బీఆర్ఎస్. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’అని కడియం హెచ్చరించారు.
ఇదీ చదవండి: కేసులకు భయపడం ఏం చేస్తారో చేస్కోండి: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment