
క్రేన్ విరిగిపడి కార్మికుడి మృతి
పాల్వంచ(ఖమ్మం జిల్లా): కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్(కేటీపీఎస్)లోని 7వ స్టేజీలో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ క్రేన్ బాడీ విరిగి పడి మోహన్(30) అనే కార్మికుడు మృతిచెందాడు. మోహన్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ముచ్చంద్ర. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.