1997 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల | 1997 Movie First Look And Motion Poster Released By Srikanth Addala | Sakshi
Sakshi News home page

1997 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

Published Mon, Aug 2 2021 9:18 PM | Last Updated on Mon, Aug 2 2021 9:30 PM

1997 Movie First Look And Motion Poster Released By Srikanth Addala - Sakshi

డా.మోహన్, నవీన్ చంద్ర, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హైరాబాద్‌లోని దసపల్ల హోటల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నారప్ప దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరై సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. 

అనంతరం శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘‘సురేష్ కొండేటి నాకు ఫోన్ చేసి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయమని అడిగితే సినిమా గురించి తెలుసుకున్నాను. చాలా మంది నటీనటులు కనిపిస్తున్నారు. టైటిల్ చాలా బాగుంది. 1997తో నాకు ఏదో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో కోటిగారు మంచి పాత్ర చేశానని చెప్పారు. ఫస్ట్ లుక్ బాగుంది. ఈ సినిమాతో దర్శకుడు, నిర్మాత, నటన ఇలా ఇన్ని పనులు చేయడం నిజంగా చాలా కష్టం, అయినా కూడా మోహన్ గారు మొదటిసారి ఇవన్నీ చేశారంటే నిజంగా గ్రేట్ సర్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించి మీరు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
 
ఇక హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చేయడానికి కారణం మోహన్ గారు ఒకరోజు నాకు ఈ కథ చెప్పారు. కథ వినగానే చేయాలని అనిపించింది. ఇది హీరోనా, చిన్న పాత్ర అన్నది కాకుండా ఓ మంచి పాత్ర చేసానన్న తృప్తి కలిగింది. మోహన్ గారు మొదటిసారి అయినా కూడా చాలా బాగా తీశారు. ముఖ్యంగా నటుడిగా కూడా అద్భుతంగా నటించారు. తప్పకుండా ఈ సినిమాను అందరూ ఆదరిస్తే ఆయన నుంచి  మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి.’’ అని అన్నారు.

అంతేకాకుండా సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘‘మోహన్ గారితో చాలా మంచి అనుబంధం ఉంది. సినిమాలో ఆయన నాకు కొడుకుగా నటించాడు. అప్పటి నుంచి తనతో అదే అనుబంధం కొనసాగుతోంది. మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. అయితే ఈ సినిమాలో మీరు నటించాలని అడిగాడు. నేను పోలీస్ కావాలని మా నాన్న కోరిక. అది ఎలాగూ జరగలేదు. అయితే ఇలా పోలీస్ పాత్రల ద్వారా అయినా ఆ కోరిక తీరింది. నేను పోలీస్‌గా దేవినేని సినిమాలో చేశాను. అప్పటినుండి చాలామంది పోలీస్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. ఒకరోజు చిరంజీవి గారు నువ్వు నటుడిగా పనికి వస్తావు ప్రొసీడ్ అవ్వమని చెప్పడంతో నేనుకూడా యాక్టింగ్ పై ఫోకస్ పెట్టాను. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’’ అని అన్నారు.

హీరో మోహన్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా కోటిగారికి థాంక్స్ చెప్పాలి. నా ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ అందించారు. ఆయన లేనిదే నేను ఏ పని చేయలేదు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు కోటిగారికే కథ చెప్పాను. ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలాగే నవీన్ చంద్రకు థాంక్స్ చెప్పాలి. కథ వినగానే వెంటనే చేస్తానని చెప్పారు. ఆయన చిన్న పాత్రయినా చాలా చక్కగా చేశాడు. అలాగే బెనర్జీ గారు, శ్రీకాంత్, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఓ బర్నింగ్ ఇష్యుని  తీసుకుని ఈ సినిమా చేశా. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement