యువతను అలరించే అంశాలతో రూపొందుతోన్న చిత్రం ‘ఒక్కడితో...’. దీనికి ఉపశీర్షిక ‘మొదలైంది’. మోహన్, మైనా, నరేశ్, లావణ్య, శరత్, అనూష ప్రధాన తారాగణం. ధన్‌రాజ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మొగిలి నాగేశ్వరరావు దర్శకత్వంలో బైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బి. మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో మోహన్ మాట్లాడుతూ -‘‘వరంగల్ పరిసరాల్లో తొలి షెడ్యూలు చేశాం. సినిమా చాలా బాగా వస్తోంది. ధన్‌రాజ్ పాత్ర కొత్తగా ఉంటుంది. కథాకథనాలు, బోలే సంగీతం ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: నవీన్‌రాజ్.
ఆకట్టుకునే కథతో...
Published Tue, Nov 18 2014 10:10 PM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM
Advertisement
Advertisement