ఆరోగ్యంగా ఉండాలంటే ఓన్లీ శాకాహారమే కాక కొద్ది మొత్తంలో మాంసకృత్తులతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిది. శరీరానకి అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభించాలంటే తప్పనిసరిగా మాంసాహారం కూడా తీసుకోవాలసిందే. కొన్ని ప్రాంతాల్లో వివిధ జంతువుల మాంసాన్ని ఇష్టంగా తింటారు. ఇక మన దేశంలో కోడి, గొర్రె మాంసం ఎక్కువగా తింటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తినే జంతు మాంస ఏదో తెలిస్తే షాకవ్వుతారు. ముఖ్యంగా మన భారత్‌లో ఏం తింటారో వింటే నోట మాట రాదు. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఏ జంతు మాంసాన్ని అత్యధికంగా ఇష్టపడుతున్నారంటే..
గత కొన్నేళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా మాంసాహార వినియోగం విపరీతంగా పెరిగింది. దీని రుచి బాగా ఎక్కువ ఉండటంతో అత్యధిక మంది వీటినే ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. అన్ని వనరులు అందుబాటులో ఉండటం కారణంగా కూడా ఈ మాంస వినియోగం ఎక్కువయ్యిందని చెప్పొచ్చు. ఇక 2017 లెక్కల ప్రకారం మాంసం వినియోగం ఏకంగా 330 మిలియన్ టన్నులు ఉంది. ప్రజల ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్యంపై స్ప్రుహ కూడా ఎక్కువగా ఉండటంతో మాంసం వినియోగం పెరిగిందనే చెప్పొచ్చు. కొన్ని దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా.. మాంసం వినియోగం మాత్రం తగ్గడం లేదు. అయితే సంపన్న దేశాల్లో మాంసం ఎక్కువగా వినియోగిస్తుండగా, పేద దేశాల్లో వినియోగం తక్కువగానే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ జంతువు మాంసం ఎక్కువగా ఇష్టపడుతున్నారో గమనిస్తే..పోర్క్ మాంసానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.
ఒక సర్వే ప్రకారం..ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు ఇష్టపడే మాంసాల్లో ఈ పోర్కే తొలి స్థానంలో నిలవడం విశేషం. ఆ తరువాత స్థానంలో చికెన్‌నును ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు వెల్లడయ్యింది. భారత్లో కూడా చికెన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత మూడో స్థానంలో గొడ్డు మాంసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీని ధర తక్కువగా ఉండడంతో చాలా మంది దీనికి మొగ్గు చూపిస్తున్నారు. మేకలు నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఐదో స్థానంలో టర్కీ కోడి ఉంది. దీనిని ఎక్కువగా ఉత్తర అమెరికా, మెక్సికోలో ఎక్కువగా వాడుతారు.
ప్రపంచంలో బాతు మాంసం ఆరో స్థానంలో నిలిచింది. దీనిని చైనా, అమెరికాలో ఎక్కువగా వినియోగిస్తారు. ఏడో స్థానంలో గేదె మాంసం ఉంది. దీనిని ఆసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా తింటారు. కుందేలు మాంసం 8వ స్థానంలో నిలిచింది. దీనిని చైనా, ఉత్తర కొరియాలో ఎక్కువగా తింటారు. తొమ్మిదో స్థానంలో జింక ఉండగా..జపాన్ లో ఈ మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు.
కాగా, అత్యంత తక్కువ మాంసం వినియోగిస్తున్న దేశంగా భారత్ నిలవడం విశేషం. ఇక్కడ మాంసాహారం కంటే శాఖాహారానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మరో సర్వే ప్రకారం మూడింటరెండు వంతుల మాంసాహారం వినియోగిస్తున్నారని తేలినా.. సగటు వినియోగంతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మిక భావాలు, సంప్రదాయాలు పట్టింపులు ఎక్కువగా ఉండడం వల్ల అంత తొందరగా మాంసాహారం జోలికి వెళ్లరు.
(చదవండి: చల్లటి నీరు అరుదైన గుండె వ్యాధికి దారితీస్తుందా? ఓ బాడీబిల్డర్ చేదు అనుభవం)
Comments
Please login to add a commentAdd a comment