
'ప్రజల తిండి విషయంలో జోక్యం చేసుకోం'
కోల్కతా: ముంబయిలో మాంసంపై నిషేధం విధించడంపట్ల విమర్శలు చేస్తున్నవారి సరసన పరోక్షంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరారు. తమ ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం జోక్యం చేసుకోదని చెప్పారు. ఏం తినాలనేది నిర్ణయించుకునేది ప్రజలే తప్ప ప్రభుత్వ పరంగా నిర్ణయించలేమని, నిర్ణయించకూడదని అన్నారు.
ఎవరు ఏం తినాలో వారి స్వయం నిర్ణయం అని చెప్పారు. సోమవారం మైనారిటీ డెవలప్మెంట్ శాఖ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రస్తావించకుండానే తాను తన రాష్ట్రంలో విభజించి పాలన చేయనని, అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతోనే పనిచేస్తానని చెప్పారు.