పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి. ఈ సామెత ప్రపంచంలో ఉండే మానవుల అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కొక్కరికి ఒక్కొ విధంగా ఉంటాయని తెలియజేసే సందర్భంలో ఈ సామెత వాడతారు. అంతేందుకు మన చుట్టూ ఉన్నవారు రకరకాల అభిరుచులను కలిగి ఉంటారు. వారి ఆహారపు అలవాట్లు కూడా వింతగా ఉంటాయి. కొంతమంది తమనీ తాము మర్చిపోవడానికి మద్యం, గంజాయిని ఎక్కువగా సేవిస్తుంటారు. అది వారికి ఒక వ్యసనంలా తయారవుతుంది. ఇంతకుముందు చెప్పిన సామెత ప్రకారం ఒక్కొక్కరు, ఒక్కొ విధంగా చెడు అలవాట్లను అలవర్చుకుంటారు.
తాజాగా మత్తు బాగా రావడం కోసం ఓ వ్యక్తి చేసిన వింత ప్రయత్నానికి సంబంధించి ఇంటర్నెట్‌లో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం బాగా వైరలయ్యింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే కుళ్లిన మాంసం. ఔను మీరు విన్నది నిజమే...! కుళ్లిన మాంసాన్ని తిని సదరు వ్యక్తి మత్తులో ఊగిపోతున్నాడు. ఈ విషయాన్ని బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కుళ్లిన మాంసం తింటే మత్తులో ఊగిపోవచ్చునని తన స్నేహితుడు చెప్పిన వెంటనే, ఆచరించాడు. అంతేకాకుండా కుళ్లిన మాంసాన్ని తినడం ద్వారా తనకి ఏం జరగలేదనే విషయాన్ని కూడా ఇతరులతో పంచుకున్నాడు. ఇంకా ఈ కుళ్లిన మాంసం ఎంతో రుచిగా ఉందని తెలిపాడు. ఈ విషయాన్ని 2017లోనే కుళ్లిన మాంసంతో కిక్కు వస్తుందని ఓ యూట్యూబర్ ఒక వీడియోలో తెలిపాడు.
ఇలాంటి కుళ్లిన మాంసం తినడంతో ఆరోగ్యరీత్యా ఇబ్బందులకు గురవుతారని వైద్య నిపుణులు వెల్లడించారు. కుళ్లిన మాంసం కొన్ని సార్లు విష పదార్థంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. అసలు కుళ్లిన మాంసం జోలికి పోకుండా ఉండటమే మంచిదని వైద్యులు చెప్తున్నారు
చదవండి: వైరల్: ఓ పక్క ఆక్సిజన్ పీలుస్తూ, మరోపక్క గుప్పుమంటూ సిగరెట్
Comments
Please login to add a commentAdd a comment