పశుమాంసంతో నూనె తయారీ: వ్యక్తి అరెస్ట్
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పశుమాంసంతో నూనె తయారు చేస్తున్న ఓ కేంద్రం గుట్టురట్టయ్యింది. పోలీసుల దాడులతో ఈ నిర్వాకం వెలుగుచూసింది. ఆదివారం ఆల్‌జబ్రీ కాలనీలోని ఫార్మ్‌హౌస్‌పై దాడులు నిర్వహించిన పోలీసులు పశుమాంసంతో నూనెను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.