చెట్ల మాంసాన్ని మీరు తినబోతున్నారు..!! | You could soon be eating meat grown by plants | Sakshi
Sakshi News home page

చెట్ల మాంసాన్ని మీరు తినబోతున్నారు..!!

Published Sat, Oct 7 2017 8:28 PM | Last Updated on Fri, Nov 9 2018 6:23 PM

You could soon be eating meat grown by plants - Sakshi

టెపిక్‌, మెక్సికో : మరికొద్ది సంవత్సరాల్లో మీరు జంతువుల మాంసానికి బదులు చెట్ల నుంచి తయారు చేసిన మాంసాన్ని ఆస్వాదించబోతున్నారు. అవును. ప్రపంచవ్యాప్తంగా మాంసానికి డిమాండ్‌ విపరీతంగా పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలకు అడుగులు పడుతున్నాయి.

2050 కల్లా ధనిక దేశాల్లో జంతువుల మాంసం మాయమవుతుందని ఓ పరిశోధకుడి రిపోర్టు. ఆయన ​ప్రకారం  చెట్ల నుంచి తయారు చేసిన మాంసం లేదా ఫ్యాక్టరీల్లో తయారు చేసిన మాంసం మార్కెట్లో, రెస్టారెంట్లలో మాంసాహార ప్రియులకు విందుగా మారుతుంది.

సాధారణ జంతువుల మాంసంతో పోల్చితే అత్యధిక ప్రొటీన్‌ విలువలతో రుచిగా ఈ మాంసం ఉంటుంది. పురుగులు, స్పిరులినా లాంటి ప్రత్యమ్నాయంగా మారుతాయని మరికొందరు పరిశోధకులు చెప్పారు. యూఎన్‌ ఫుడ్‌ అగ్నికల్చర్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఏఓ) ప్రకారం.. 2050 కల్లా మానవ అవసరాల రీత్యా వ్యవసాయ ఉత్పత్తులు 50 శాతం పెరగాల్సివుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement