చెట్ల మాంసాన్ని మీరు తినబోతున్నారు..!!
టెపిక్, మెక్సికో : మరికొద్ది సంవత్సరాల్లో మీరు జంతువుల మాంసానికి బదులు చెట్ల నుంచి తయారు చేసిన మాంసాన్ని ఆస్వాదించబోతున్నారు. అవును. ప్రపంచవ్యాప్తంగా మాంసానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలకు అడుగులు పడుతున్నాయి.
2050 కల్లా ధనిక దేశాల్లో జంతువుల మాంసం మాయమవుతుందని ఓ పరిశోధకుడి రిపోర్టు. ఆయన ప్రకారం చెట్ల నుంచి తయారు చేసిన మాంసం లేదా ఫ్యాక్టరీల్లో తయారు చేసిన మాంసం మార్కెట్లో, రెస్టారెంట్లలో మాంసాహార ప్రియులకు విందుగా మారుతుంది.
సాధారణ జంతువుల మాంసంతో పోల్చితే అత్యధిక ప్రొటీన్ విలువలతో రుచిగా ఈ మాంసం ఉంటుంది. పురుగులు, స్పిరులినా లాంటి ప్రత్యమ్నాయంగా మారుతాయని మరికొందరు పరిశోధకులు చెప్పారు. యూఎన్ ఫుడ్ అగ్నికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) ప్రకారం.. 2050 కల్లా మానవ అవసరాల రీత్యా వ్యవసాయ ఉత్పత్తులు 50 శాతం పెరగాల్సివుంది.