కాకులతో పెట్టుకుంటావా.. ఖబడ్దార్‌! | Crows Revenge | Sakshi
Sakshi News home page

కాకులతో పెట్టుకుంటావా.. ఖబడ్దార్‌!

Published Tue, Jul 25 2017 4:09 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM

కాకులతో పెట్టుకుంటావా.. ఖబడ్దార్‌!

కాకులతో పెట్టుకుంటావా.. ఖబడ్దార్‌!

వేమనపల్లి: పాములు పగబడుతాయనే మాట విన్నాం.. కానీ కాకులు కూడా పగబట్టడం వింతే మరి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలకేంద్రం బొగుడ గూడెంలో కాకుల జంట ఓ యువరైతును పగబట్టాయి! అతను ఎటు వెళ్లినా వెంటప డుతూ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. తెల్గ రమేశ్‌ అనే వ్యక్తిని ఓ కాకుల జంట గత పది రోజులుగా వెంబడిస్తోంది. రమేశ్‌ ఇంటి సమీపంలో ఉన్న వేపచెట్టు ఇటీవల గాలి దుమారాలకు ఒక వైపునకు వంగింది. రోడ్డు వెంట రాకపోకలకు ఇబ్బందిగా ఉందని రమేశ్‌ ఆ చెట్టు కొమ్మలను నరికాడు. అదే వేప చెట్టుపై ఉన్న కాకి గూడును అతను గమనించ లేదు.

ఆ కొమ్మలు నరుకు తుండగా గూట్లో ఉన్న కాకిపిల్లలు కింద పడ్డాయి. ఇక అంతే.. ఆ కాకులు వెంటనే రమేశ్‌పై దాడికి దిగాయి. కావు కావు మం టూ అరుస్తూ, కాళ్లతో కొడుతూ, ముక్కుతో పొడుస్తూ బీభత్సం సృష్టిం చాయి. వాటి గోలకు తట్టుకోలేక ఇంట్లోకి పరిగెత్తాడు. కిందపడ్డ కాకి పిల్లలను కాపాడాలని గ్రామస్తులు సూచించారు. దీంతో వాటిని తట్టలోకి తీసుకుని కొమ్మలు లేని ఆ వేప చెట్టుపై పెట్టాడు. అప్పటి నుంచి కాకులు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నా యి. కానీ, రమేశ్‌ను మాత్రం వదిలిపెట్టడం లేదు. చెట్టు పక్కనే ఉన్న గడ్డివాము వద్దకెళ్లి ఎడ్లకు మేత వేద్దామన్నా వెంబడిస్తున్నాయి.

వాడలో కనిపించినా, రోడ్డు మీదకొచ్చినా దాడికి దిగుతున్నాయి. దీంతో రమేశ్‌ వాటి కంటపడకుండా వ్యవసాయ పనులకు వెళుతున్నాడు. ‘‘కాకులతోని నాకిదేం గోస, వాటి పగ గింత ఘోరంగా ఉంటుందనుకోలేదు. వాటి పిల్లలను కింద పడేసినందుకే నా మీద కసి పెంచుకు న్నయ్‌. మా బొగుడగూడెంల ఎక్కడ కనపడ్డా నాపై దాడికి దిగుతున్నాయి. ఆటికి కనపడకుండా చేన్లకు, ఎవుసపు పనులకు పోతాను’’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement