సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన తొర్ర ఎల్లయ్య(55) అనే పవర్‌లూం కార్మికుడు అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. గతకొన్నేళ్లుగా ఎల్లయ్య మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
పవర్‌లూం కార్మికుడి ఆత్మహత్య
Aug 29 2016 7:05 PM | Updated on Nov 6 2018 8:04 PM
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన తొర్ర ఎల్లయ్య(55) అనే పవర్‌లూం కార్మికుడు అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. గతకొన్నేళ్లుగా ఎల్లయ్య మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లకు వివాహం చేయగా, ఒక కుమార్తెకు విడాకులై ఇంటివద్దే ఉంటోంది. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య కుటుంబ అవసరాల కోసం రూ.5లక్షల దాకా అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించుకోలేక మనస్తాపం చెంది సోమవారం విషపదార్థం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
Advertisement