ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు బలవన్మరణం | Handloom weaver commits suicide | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు బలవన్మరణం

Published Mon, Jun 8 2015 8:22 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Handloom weaver commits suicide

సిరిసిల్ల రూరల్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రాజీవ్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్‌నగర్‌కు చెందిన నామా భూమేశ్(35)  చేనేత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా 15 రోజులుగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న బంద్‌తో ఉపాధి కరువైంది. దాంతో ఆర్థిక ఇబ్బందులతోపాటు అనారోగ్యంతో మనస్తాపానికి గురైన అతడు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement