ఏజెన్సీలో డబ్బు వసూలు చేస్తున్న దృశ్యం
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గృహజ్యోతి’ పథకంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ప్రారంభానికి ముందే అక్రమార్కులకు కాసులపంట కురిపిస్తోంది. ఈకేవైసీ పేరుతో అందినకాడికి దోచుకుంటున్న విషయం మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై మహిళలు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు.
స్థానిక శివనగర్ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీకి రూ.150 చెల్లించాలని ఏజెన్సీ నిర్వాహకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మరోవైపు ఈకేవైసీతో పాటుగా కచ్చితంగా పైపు తీసుకోవాలనే నిబంధన ఉందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారిని వివరణ కోరగా.. ఈకేవైసీకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment