రాజన్న సిరిసిల్ల జిల్లా : ఓ రైతు వద్ద రూ.18 వేలు లంచం తీసుకుంటూ తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వీఆర్వో ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డబ్బులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. జిల్లెల్లకు చెందిన కిరణ్ అనే రైతు సాదా బైనామాతో భూమిని ముటేషన్ చేసేందుకు వీఆర్‌ఓను ఆశ్రయించాడు. పని చేసేందుకు వీఆర్‌ఓ రూ.18 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా..పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment