
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ వధూవరులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వివరాలివి. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం రామన్నపేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి నాగుల శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శి మౌనిక వివాహం బుధవారం కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో జరిగింది.
పెళ్లితంతు అనంతరం వధూవరులిద్దరూ.. ‘జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలి..’ అనే ప్లకార్డు ప్రదర్శించారు.
(చదవండి: నో పార్కింగ్.. అయితే ఏంటి?)