
సాక్షి, రాజన్న సిరిసిల్ల : టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని మంత్రి కే తారక రామారావు అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు వేల కోట్లతో సిరిసిల్లను అభివృద్ది చేశామంటూ పేర్కొన్నారు. రైతుకు ఎంత చేసినా తక్కువే అంటూ.. ఇప్పటికే వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతుబంధు ద్వారా ఎనిమిది వేలు ఇస్తున్నానమని, మళ్లీ అధికారంలోకి వచ్చాక పదివేలకు పెంచుతామని హామి ఇచ్చారు. రైతు బీమా ద్వారా బాధిత రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని, రైతు చనిపోతే ఐదు లక్షలు ఇస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువులు, విత్తనాలకు క్యూలో నిలబిడ్డామని గుర్తుచేశారు. ఆదాయం పెంచి పేదలకు పెంచాలన్నదే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగానే నాకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చిందని అన్నారు. సంక్షేమ పథకాలలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు.