సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజు రోజుకూ విస్తరిస్తుంది. మరో వారంరోజుల కార్యాచరణ ప్రణాళిక జిల్లా సాధన జేఏసీ శనివారం ప్రకటించింది. సర్వమత పార్థనలతో పాటు, వినాయకుడికి విన్నపాలు, వంటావార్పు, మానవహారం, బోనాల పండుగ, చలో కలెక్టరేట్, సిరిసిల్ల దిగ్భంధానికి ప్రణాళిక రూపొందించింది. మరోవైపు ప్రై వేటు స్కూల్స్, కళాశాలల యజమానులు సిరిసిల్లలో నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన నిర్వహించారు. కోర్టు ఎదుట న్యాయవాదులు, అంబ
-
దీక్షలు.. సంఘీభావ ర్యాలీలు
-
ఆర్డీవోకు వైఎస్సార్ సీపీ వినతి
-
కార్యాచరణ ప్రకటించిన జేఏసీ
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజు రోజుకూ విస్తరిస్తుంది. మరో వారంరోజుల కార్యాచరణ ప్రణాళిక జిల్లా సాధన జేఏసీ శనివారం ప్రకటించింది. సర్వమత పార్థనలతో పాటు, వినాయకుడికి విన్నపాలు, వంటావార్పు, మానవహారం, బోనాల పండుగ, చలో కలెక్టరేట్, సిరిసిల్ల దిగ్భంధానికి ప్రణాళిక రూపొందించింది. మరోవైపు ప్రై వేటు స్కూల్స్, కళాశాలల యజమానులు సిరిసిల్లలో నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన నిర్వహించారు. కోర్టు ఎదుట న్యాయవాదులు, అంబేద్కర్ వద్ద టీఆర్‌ఎస్ నాయకులు దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా సాధన కోసం మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌పీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆర్డీవో జీవీ. శ్యామ్‌ప్రసాద్‌లాల్‌కు వినతిపత్రం అందించారు. కులసంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీలు కొనసాగాయి. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, కోనరావుపేట, వేములవాడ, చందుర్తి మండలాల్లోనూ నిరసనలు కొనసాగాయి. టీఆర్‌ఎస్ నాయకులూ జిల్లా సాధన కోసం కదం తొక్కుతున్నారు.