స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన ఓ యువకుడు మానేరువాగులో పడి మృతిచెందిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది.
-
మానేరులో యువకుడి దుర్మరణం
సిరిసిల్ల టౌన్ : స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన ఓ యువకుడు మానేరువాగులో పడి మృతిచెందిన సంఘటన గురువారం పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన గడ్డం శ్రీనివాస్, సారవ్వ కుమారు అజయ్(20) హైదరాబాద్ రైల్వేలో ప్రై వేటు కూలిగా పనిచేస్తున్నాడు. దసరా పండుగ కోసం నాలుగురోజుల క్రితం ఇంటికొచ్చాడు. మానేరువాగును చూసేందుకు స్నేహితులు వంశీ, అరుణ్‌తో కలిసి వెళ్లాడు. ఈతకొడుతున్న సమయంలో అజయ్‌కి అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో మునిగిపోయాడు. స్నేహితులు ఒడ్డుకు చేర్చేలోపే మృతిచెందాడు.