సిరిసిల‍్ల ఎంపీపీ రాజీనామా
Published Tue, Jan 10 2017 2:40 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM
సిరిసిల‍్ల: రాజన‍్న సిరిసిల‍్ల జిల్లా సిరిసిల‍్ల మండల ప్రజాపరిషత్ అధ‍్యక్షురాలు దడిగెల కమలాబాయి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఎంపీడీవోకు ఇచ్చారు. టీఅర్‌ఎస్ ఎంపీటీసీల మధ‍్య జరిగిన ఒప‍్పందం ప్రకారం కమలాబాయి 2013 జూన్ 4 వ తేదీన బాధ‍్యతలు చేపట్టి ఎంపీపీ పదవిలో రెండున‍్నరేళ‍్లు కొనసాగారు. పదవీ కాలం పూర్తి కావడంతో కమలాబాయి రాజీనామా చేశారు. ఒప‍్పందం ప్రకారం పెద్దూర్ ఎంపీటీసీ సభ‍్యురాలు జూపల్లి శ్రీలత ఎంపీపీ బాధ‍్యలు చేపట‍్టే అవకాశం ఉంది.
Advertisement
Advertisement