జిల్లా సిగలో ‘సెస్‌’ వెలుగులు | sircilla Power supply cooperative association | Sakshi
Sakshi News home page

జిల్లా సిగలో ‘సెస్‌’ వెలుగులు

Published Thu, Oct 27 2016 3:07 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

జిల్లా సిగలో ‘సెస్‌’ వెలుగులు - Sakshi

జిల్లా సిగలో ‘సెస్‌’ వెలుగులు

జిల్లాలో సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ ద్వారా కరెంటు కొనుగోలు చేస్తూ వినియోగదారులకు సరఫరా చేస్తోంది.

విస్తరించనున్న సేవలు 
అడిగిన వెంటనే కనెక్షన్‌
ఆదర్శవంతమైన సరఫరా 
జిల్లా ఏర్పాటుతో నాణ్యమైన విద్యుత్‌
 
రాష్ట్రంలో డిస్కంల ద్వారా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. కానీ, జిల్లాలో సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ ద్వారా కరెంటు కొనుగోలు చేస్తూ వినియోగదారులకు సరఫరా చేస్తోంది. గ్రామీణ వికాసం, పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తూ.. వ్యవసాయ, వస్త్రోత్పత్తి రంగాలను అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తోంది. జిల్లా ఏర్పాటుతో తన సేవలు విస్తరించేందుకు ముందుకు సాగుతోంది.
 
సాక్షి, సిరిసిల్ల : సహకార రంగంలో ఉత్తమ సేవలందిస్తున్న సంస్థగా ‘సెస్‌’కు పేరుంది. కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) దేశవ్యాప్తంగా ఐదు గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘాలను 1970 దశకంలో స్థాపిం చగా అందులో సిరిసిల్ల ‘సెస్‌’ ఒక్కటి. మిగతావి ఉనికి కోల్పోయినా ‘సెస్‌’ మెరుగైన విద్యుత్‌ సరఫరా చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం, వస్త్రో త్పత్తి రంగ అభివృద్ధికి బాటలు వేస్తోంది. అడిగిన వెంటనే విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే 24 గంటల్లో రిపేరు చేస్తోంది. 2007 వరకు ‘సెస్‌’ పరిధిలో వినియోగదారులే స్వచ్ఛందంగా విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేసుకునేవారు. మరోవైపు.. ‘సెస్‌’ పరిధిలో విద్యుత్‌ లైన్‌లాస్‌ 15శాతం లోపే ఉంటోం ది. ఇప్పుడది 32 శాతానికి పెరిగింది. విని యోగదారులు క్రమం తప్పకుండా 85 శా తం మంది బిల్లులు చెల్లిస్తున్నారు. సంస్థ ప ని తీరును విదేశీ విద్యుత్‌ కంపెనీల ప్రతి నిధులు సందర్శించి అభినందించారు. వి ద్యుత్‌ పంపిణీ విధానంపై విదేశీ ఇంజినీరింగ్‌ విద్యార్థులు, విదేశీ విద్యుత్‌ సంస్థలు అధ్యయనం చేసి సేవలు అద్భుతమని కితాబిచ్చారు.
 
మెరుగైన వేతనాలు..
ఎన్‌పీడీసీఎల్‌(ఉత్తర మండల విద్యుత్‌ పం పిణీ కంపెనీ) ద్వారా ‘సెస్‌’ ప్రతీ యూనిట్‌ విద్యుత్‌ను రూ.రూపాయికి కొనుగోలు చేస్తోంది. వ్యవసాయ రంగానికి ఉచితంగా, మరమగ్గాలకు 50శాతం రాయితీపై, వాణి జ్య అవసరాలకు రూ.4.50– రూ.8 చొప్పు న విక్రయిస్తోంది. వ్యవసాయ రంగం రా యితీని ప్రభుత్వం భరిస్తోంది. మరమగ్గాలకు అందించే రాయితీని ప్రభుత్వం ‘సెస్‌’కు చెల్లిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో రేయింబవళ్లు అందుబాటులో ఉండి సేవలందిస్తారనే ఉద్దేశంతో సిబ్బందికి మంచి వేతనాలు అందిస్తారు. ఉద్యోగులకు మెరుగైన జీతాలున్నాయి.
 
భర్తీకి నోచుకోని ఉద్యోగ ఖాళీలు
‘సెస్‌’కు సొంతంగా ఉద్యోగులను నియమించుకునే స్థోమత ఉన్నా ప్రభుత్వం నుం చి అనుమతి రావడంలేదు. దీంతో ఏళ్లుగా కీలక పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. 1998లో 338 మంది సిబ్బంది ఉండగా వివిధ కారణాలతో 2011 నాటికి 123 మం దికి తగ్గారు. విలేజీ ఎలక్ట్రికల్‌ వర్కర్లకు అసిస్టెంట్‌ హెల్పర్లుగా పదోన్నతి కల్పించడం తో ఉద్యోగుల సంఖ్య 261 మందికి చేరిం ది. కీలకమైన పోస్టులన్నీ ఎన్‌పీడీసీఎల్, ట్రాన్స్‌కో నుంచి డెప్యుటేషన్‌పై భర్తీ చేస్తున్నారు. దీంతో సంస్థలో అజమాయిషీ కొరవడింది. రాత్రి వేళల్లో విద్యుత్‌ సరఫరా నిలి చిపోతే సరిచేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల పని తీరు పరి శీలన, మరమ్మతులోనూ జాప్యమవుతోం ది. విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టలేకపోతున్నా రు. సంస్థ అభివృద్ధి, బకాయిల వసూళ్లపై పర్యవేక్షణ లోపిస్తోంది.
 
అందరికీ సహకారం..
-జిల్లా కేంద్రం కావడంతో ‘సెస్‌’ కార్యాలయాన్ని కలెక్టరేట్‌ కోసం కేటాయించారు
-జిల్లా ఏర్పాటుతో సంస్థ ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా చర్య తీసుకోవాలి
-ఇప్పటికే రూ.70 కోట్ల మేర ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బకాయిల వసూళ్లపై దృష్టిసారించాలి
-వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు మండల కేంద్రాల్లోని సేవాసదన్లను కంప్యూటరీకరించాలి
-సీసీ కెమెరాలతో ఆధునికీకరించాలి
-లైన్‌లాస్‌ను తగ్గించి విద్యుత్‌ చౌర్యాన్ని అరికట్టాలి
-సభ్యులందరికీ విద్యుత్‌ సహకారం అందించేలా పాలకులు నిర్ణయించాలి.
 
 
‘సెస్‌’ సమగ్ర స్వరూపం
స్థాపితం : 1970 నవంబరు 1
ఉద్యోగుల సంఖ్య : 261
మెుత్తం విద్యుత్‌ కనెక్షన్లు : 2,13,190
వ్యవసాయ కనెక్షన్లు : 62,836
మరమగ్గాల కనెక్షన్లు : 8,265
గృహవిద్యుత్‌ కనెక్షన్లు : 1,42,089
 
‘సెస్‌’ పరిధిలోని ప్రాంతాలు
సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, బోయినపల్లి, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్గొండ కలిపి మెుత్తం 177 గ్రామాలు.
 
 
విద్యుత్‌ సబ్‌స్టేషన్లు : 44
కొనుగోలు : 6.50 కోట్ల యూనిట్లు
నెలవారీ బిల్లులు : రూ. 6.25 కోట్లు
‘సెస్‌’లో సభ్యుల సంఖ్య : 2,62,134
సంస్థ ఆస్తుల విలువ : రూ.120 కోట్లు
ప్రస్తుత ఓటర్ల సంఖ్య : 1,31,843
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement