
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు
సాక్షి, సిరిసిల్ల : రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా నీరు అందించటానికి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు అభిప్రాయపడ్డారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, మిషన్ భగీరథలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నల్లాల నీరు ద్వారా ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నారు. మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. దేశంలో 28 రాష్ట్రాలు చేయలేని పనిని తెలంగాణ రాష్ట్రం చేస్తుందని అన్నారు. కేంద్ర మంత్రులను, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మిషన్ భగీరథ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment