విద్యార్థినులను వేధిస్తున్న పోకిరి అరెస్ట్
Published Mon, Jan 2 2017 1:09 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM
సిరిసిల్ల: పోకిరి వేషాలు వేస్తూ.. విద్యార్థినులను ఏడిపిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల రాజీవ్ నగర్‌కు చెందిన పెండ్యం రాజు గత కొంతకాలంగా కళాశాలకు వెళ్తున్న విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వేధింపులు ఎక్కువవడంతో.. ఓ విద్యార్థిని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో సోమవారం రంగంలోకి దిగిన స్థానిక ఎస్సై శ్రీనివాస్ విచారణ చేపట్టి పోకిరిని అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement