
సిరిసిల్ల: ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణ విద్యార్థులు స్వస్థలం వచ్చేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ప్రభావంతో అక్కడి విద్యా సంస్థలు మూసివేయగా స్వగ్రామానికి వచ్చేందుకు విద్యార్థులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆదివారం నుంచి భారత దేశానికి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేయనుండటంతో లండన్‌లో ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు మొదలయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన 50 మంది ఉన్నారు. తిరిగి వెళ్లేందుకు విమానాలు లేవని, టికెట్లు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు సిబ్బంది చెప్పడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. భారత్ వచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment