విశాఖ : ఈవ్ టీజర్ల ఆటకట్టించేందుకు విశాఖ పోలీసులు సరికొత్త ప్రయోగం చేశారు. కళాశాలల్లో ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శివధర్ రెడ్డి తెలిపారు. అంతే కాకుండా ద్విచక్ర వాహనదారులతో పాటు వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా ఇకపై హెల్మెట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే కారులో కూడా డ్రైవింగ్ చేసే వ్యక్తితో పాటు కూర్చున్నవారంతా తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేశారు.