సాక్షి, సిరిసిల్ల: ప్రతి పక్షాలు ఓట్లు అడగడానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి చెప్పి నిలదీయండి అంటూ తెలంగాణ సమాజానికి మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. బీసీ బందు పథకంలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. సుమారు 600 మందికి చెక్కులను కేటీఆర్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా. మందు పోయను. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఎలాగైనా మీకు సేవ చేసుకుంటూనే ఇంట్లో కూర్చుంటా అంటూ వ్యాఖ్యానించారాయన. అలాగే.. పింఛన్ పెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా కేటీఆర్ స్పందించారు.
‘‘ప్రతిపక్షాలు మాకు సలహాలు ఇస్తే కేసీఆర్ పెన్షన్ పెంచలేదు. ఆరువందల మందికి పెన్షన్ వస్తే వార్త కాదు.. ఆరుగురికి రాకపోతే ఇవాళ రేపు వార్త అవుతోంది. తెలంగాణాలో 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం. వేములవాడ తిప్పాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 70% శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లాలో వచ్చే నెలలో కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం. చేనేత దినోత్సవం సందర్భంగా 9 రకాల పథకాలు అమలు చేసుకున్నాం. అలాగే..
బీసీబంధు అంటే లోన్ కాదు. ఇది కేవలం మీ(బీసీ లబ్ధిదారుల్ని ఉద్దేశించి..) కులవృతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. తిగిగి కట్టవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ‘‘వేములవాడకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. 24 గంటలు మంచి నీరు అందేలా చర్యలు చేపడుతున్నాం. వేములవాడ ఆలయాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తాం’’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఇదీ చదవండి: కోకాపేట వేలంపాటపై సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment