bandhu
-
బాబు కుంభకోణాలన్నీ బయటకొస్తాయి
కొవ్వూరు/ఆరిలోవ (విశాఖ తూర్పు): చంద్రబాబు అవినీతి కుంభకోణాలన్నీ బయటకొస్తాయని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. నేరం చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబునాయుడుకి విధేయులుగా ఉన్న కొందరు చట్టాన్ని తప్పుపట్టటం సరికాదని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన సాక్ష్యాదారాలున్నందునే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిందని చెప్పారు. చంద్రబాబు జైలుకెళ్లడం పట్ల ప్రజలు సంతోషంతో ఉన్నారని, అందుకే టీడీపీ చేపట్టిన బంద్‌లో ప్రజలు పాల్గొనలేదని తెలిపారు. విశాఖపట్నంలో సోమవారం ప్రారంభమైన జైళ్లశాఖ జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతోను, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘సాక్షి’తోను మాట్లాడారు. నేరం చేసినవారు ఎంతటివారైనా చట్టం దృష్టిలో సమానులేనని చెప్పారు. టీడీపీ నాయకులు, కొన్ని చానళ్లు, పత్రికలు చట్టాన్ని, న్యాయవ్యవస్థను తప్పుపట్టడం మంచిది కాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తే, దాన్ని రాజకీయ వైరంగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. రాజధానికి వేలాది ఎకరాల భూముల సేకరణ విషయంలో బినామీల పేరుతో చంద్రబాబు రూ.వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. తెలంగాణలో ఓటుకి కోట్లు కేసులో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయాడన్నారు. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారి భూములను చంద్రబాబు, ఆయన మనుషులు దోచుకున్నారని చెప్పారు. ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పాటు రామోజీ కొడుకు వియ్యంకుడు ఆర్.వి.ఆర్.రఘు కేంద్ర ఐటీశాఖ అధికారులకు దొరికిపోవడం వలన రాజధాని కుంభకోణాలు విచారించడానికి వీల్లేదని వాదిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఐటీశాఖ చంద్రబాబుకి అవినీతిపై నోటీసులిస్తే పచ్చమీడియా నోరు మెదపడం లేదన్నారు. రూ.2 వేలకోట్ల లావాదేవీలు చేశారని, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ప్రధాన నిందితుడని ఐటీశాఖ సాక్ష్యాధారాలతో నోటీసులిచి్చనా విచారణగానీ, అరెస్ట్గానీ చేయకూడదా.. అని ప్రశ్నించారు. ఇంతకాలం చంద్రబాబు దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, స్టేలు తెచ్చుకుంటూ కాలం గడిపారని చెప్పారు. చంద్రబాబు వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ దుష్టచతుష్టయానికి వాటాలు పంచుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్‌తో అవినీతి భాగస్వాముల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. అవినీతికి పాల్పడిన కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ప్రతీకారంతో చేశారంటూ టీడీపీ, జనసేన, పచ్చమీడియా ప్రజలను నమ్మించేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు ఎద్దేవా చేశారు. అవినీతి డొంక కదిలింది ఇంతకాలం చంద్రబాబు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని అవినీతి సామ్రాజ్యాన్ని నడిపారని హోంమంత్రి వనిత అన్నారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతి డొంక కదిలిందని, ఒక్కో కుంభకోణం బయటపడుతుందని చెప్పారు. ఈ వ్యవహారంలో లోకేశ్‌పైన కూడా అనుమానాలున్నాయని, సీఐడీ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజాజీవనానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు. దీనిపై పోలీసులు బాధ్యతాయుతంగా వ్యహరించారని ఆమె పేర్కొన్నారు. -
మందు పోయను, ఓడిపోతే మాత్రం.. : కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ప్రతి పక్షాలు ఓట్లు అడగడానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి చెప్పి నిలదీయండి అంటూ తెలంగాణ సమాజానికి మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. బీసీ బందు పథకంలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. సుమారు 600 మందికి చెక్కులను కేటీఆర్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా. మందు పోయను. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఎలాగైనా మీకు సేవ చేసుకుంటూనే ఇంట్లో కూర్చుంటా అంటూ వ్యాఖ్యానించారాయన. అలాగే.. పింఛన్ పెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా కేటీఆర్ స్పందించారు. ‘‘ప్రతిపక్షాలు మాకు సలహాలు ఇస్తే కేసీఆర్ పెన్షన్ పెంచలేదు. ఆరువందల మందికి పెన్షన్ వస్తే వార్త కాదు.. ఆరుగురికి రాకపోతే ఇవాళ రేపు వార్త అవుతోంది. తెలంగాణాలో 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం. వేములవాడ తిప్పాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 70% శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లాలో వచ్చే నెలలో కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం. చేనేత దినోత్సవం సందర్భంగా 9 రకాల పథకాలు అమలు చేసుకున్నాం. అలాగే.. బీసీబంధు అంటే లోన్ కాదు. ఇది కేవలం మీ(బీసీ లబ్ధిదారుల్ని ఉద్దేశించి..) కులవృతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. తిగిగి కట్టవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ‘‘వేములవాడకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. 24 గంటలు మంచి నీరు అందేలా చర్యలు చేపడుతున్నాం. వేములవాడ ఆలయాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తాం’’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇదీ చదవండి: కోకాపేట వేలంపాటపై సంచలన ఆరోపణలు -
ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదు: సీఎం కేసీఆర్
-
ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్‌లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం దళితబంధుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వంద శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. దళితులకు స్థలం ఉంటే ఇళ్ల నిర్మాణ కోసం ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం వెల్లడించారు. దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. వారం, పది రోజుల్లో హుజురాబాద్‌లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దళిత బంధు లబ్ధిదారులకు గుర్తింపు కార్డు అందిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. బార్‌కోడ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్‌ను ఐడీకార్డులో చేర్చి పథకం అమలు చేస్తామని తెలిపారు. పథకం అమలు తీరు సమాచారమంతా పొందుపరుస్తామన్నారు. పథకం అమలులో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. లబ్ధిదారుడు ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని భరోసానిచ్చారు. లబ్ధిదారులకు దళిత బీమా వర్తింపజేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మంత్రి సహా, దళిత ప్రజాప్రతినిధులు, ఎస్సీ డెవలప్‌మెంట్‌శాఖ, ఉన్నతాధికారులు ఈ కార్యాచరణపై కసరత్తు చేయాలని సీఎం ఆదేశించారు. కొంచెం ఆలస్యమైనా దశల వారీగా దళిత బీమాను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. -
దేశానికే ఆదర్శంగా ‘దళిత బంధు’: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) తెలిపారు. అర్హులైన దళితుందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామన్నారు. ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు శనివారం ప్రగతిభవన్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి సమావేశంలో మాట్లాడారు. దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ.80 వేల కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యే దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతుందని తెలిపారు. అందుకు పట్టుదలతో అందరం కలిసి పథకం విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని, దళిత ప్రజా ప్రతినిధులకు, మేధావులకు, సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. -
ఆర్టీసీ సమ్మె: బంద్ ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతి వ్వడం, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడంతో బస్టాండ్లు సహా రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం వరకు దుకాణాలు మూతపడ్డాయి. పెట్రోలు బంకులు కూడా ఉదయం వేళ తెరుచుకోలేదు. శనివారం రాత్రి వరకు కేవలం 516 బస్సులే (5.7%) రోడ్డెక్కాయి. ఇందులో మూడు అద్దె బస్సులు కాగా మిగతావి ఆర్టీసీ బస్సులు. కొన్ని చోట్ల ప్రైవేటు బస్సులు పోలీసు రక్షణ మధ్య రోడ్డెక్కాయి. హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట, భూపాలపల్లి, మెదక్ తదితర ప్రధాన బస్టాండ్లు ఖాళీగానే కనిపించాయి. ఆటో కార్మిక సంఘాలు, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు బంద్‌కు మద్దతిచ్చినప్పటికీ హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు పాక్షికంగా తిరిగాయి. ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లలో మాత్రం ప్రయాణికుల రద్దీ నెలకొంది. సుమారు 3.5 లక్షల మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించగా మరో 1.7 లక్షల మంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకున్నారు. తప్పనిసరిగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన ప్రయాణికుల నుంచి ప్రైవేటు వాహనదారులు ఇష్టారాజ్యంగా వసూలు చేశారు. తెలంగాణ బంద్‌ను దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది. డ్యూటీలకు రాని తాత్కాలిక డ్రైవర్లు... సమ్మె నేపథ్యంలో గత పక్షం రోజులుగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్న వేలాది మంది తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు బంద్ నేపథ్యంలో శనివారం డ్యూటీలకు హాజరు కాలేదు. కనీసం ఐదు శాతం మంది కూడా డిపోలకు రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వచ్చినా, డిపో గేట్ల వెలుపల ఆర్టీసీ కార్మికులు, విపక్షాల కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో వారికి బస్సులు ఇవ్వలేదు. ఉదయం 10 గంటల తర్వాత పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేయడం మొదలుపెట్టాక తాత్కాలిక డ్రైవర్లకు బస్సులు కేటాయించారు. చాలాచోట్ల వారు బస్సులు తీసుకొని రోడ్డెక్కగానే ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆందోళనకారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. కొన్ని చోట్ల తాత్కాలిక డ్రైవర్లను కిందకు దింపేసి బస్సు టైర్లలో గాలి తీసి నడవకుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడ బస్ డిపో వద్ద బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నించిన సైదిరెడ్డి అనే తాత్కాలిక డ్రైవర్‌పై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. మరికొన్నిచోట్ల ఒక్కో బస్సు వెంట రెండు, మూడు పోలీసు వాహనాలను ఎస్కార్టుగా ఇవ్వడంతో అవి మాత్రం వెళ్లాయి. ఎక్కడికక్కడ అరెస్టులు... బస్టాండ్ల వద్ద ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు ఉదయం నుంచే ముందస్తు అరెస్టులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టీ టీడీపీ నేత ఎల్. రమణ, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అబిడ్స్‌లో నిరసనల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్‌రావు సహా ఆ పార్టీ నేతలను, చార్మినార్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులను, హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయం వెలుపలికి రాగానే సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్పాషాలను, బస్ భవన్ ముట్టడికి యత్నించిన సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత బాల మల్లేశ్, న్యూడెమొక్రసీ నేత పోటు రంగారావు తదితరులను ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద అరెస్టు చేశారు. ఈ సందర్భంలోనే పోటు రంగారావు చేయి బొటనవేలు పోలీసు వ్యాన్ తలుపులో నలిగి కొంతభాగం ఛిద్రమైంది. దీంతో ఆయన్ను తొలుత ఉస్మానియాకు, ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు , వామపక్ష నేత తమ్మినేని వీరభద్రం అరెస్ట్ దృశ్యం డిపోలు, బస్టాండ్ల వద్ద నిరసనలు... తెలంగాణ బంద్‌లో భాగంగా ఆర్టీసీ కార్మికులు అన్ని జిల్లాల పరిధిలో శనివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, విద్యార్థి సంఘాల నాయకులు ఉదయం 4 గంటలకే డిపోల ఎదుట బైఠాయించారు. దీంతో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సూర్యాపేట, కోదాడ, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్, భైంసా డిపోల పరిధిలో ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. పరకాల జనగామ, మహబూబాబాద్ డిపోల నుంచి తెల్లవారుజామున మొదటి సర్వీస్‌ను పోలీసు ఎస్కార్ట్ సాయంతో పంపినా ఆందోళనకారులు వాటిని అడ్డుకున్నారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలో 43 బస్సులు పోలీసుల ఎస్కార్ట్ సాయంతో రోడ్డెక్కాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ, న్యూడెమోక్రసీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిజామాబాద్–2 డిపోకు చెందిన మూడు బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. కరీంనగర్ టవర్ సర్కిల్లో దుకాణాల ముందు టైర్ కాల్చి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళుతున్న బస్సుపై కొందరు రాళ్లు రువ్వడంతో అద్దం పగిలి ఓ ప్రయాణికుడి తలకు గాయమైంది. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో దాదాపు 200 మంది బైక్ ర్యాలీ నిర్వహించారు. ముల్కనూరులో ఆర్టీసీ కార్మికులు సెల్ టవర్ ఎక్కగా పోలీసులు వారికి నచ్చజెప్పడంతో కిందకు దిగారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. యాదగిరిగుట్టలో కార్మికులు వంటావార్పు చేపట్టారు. నల్లగొండలో మహిళా కార్మికులపట్ల కొందరు మహిళా కానిస్టేబుళ్లు దురుసుగా ప్రవర్తించారని కార్మికులు ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి బైపాస్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆందోళనకారులు అడ్డుకొని టైర్లలో గాలి తీసేశారు. దీంతో పోలీసులు ప్రయాణికులను ప్రైవేటు వాహనాల్లో పంపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ డిపో పరిధిలో 24 బస్సులు తిరిగాయి. బంద్‌కు సంఘీభావంగా తెలంగాణ భవన్ ముట్టడి ఆర్టీసీ కార్మికుల తెలంగాణ బంద్‌కు సంఘీభావంగా సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ను ముట్టడించారు. అయితే పోలీసులు ముందుగానే అక్కడికి చేరుకుని నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మెకు దిగిన కార్మికులపై అణచివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి తన కుటుంబ సభ్యులు, మిత్రులకు కట్టబెట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మొండి వైఖరిని వీడి కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అనంతరం నేతలు తెలంగాణ భవన్ ఏఆర్సీ వేదాంతం గిరిని కలసి వినతిపత్రం సమర్పించారు. ‘క్యాబ్ డ్రైవర్లూ.. సమ్మె విరమించండి’ ఆర్టీసీ కార్మికుల సమ్మెను దృష్టిలో పెట్టుకుని ఓలా, ఉబర్ తదితర క్యాబ్ డ్రైవర్లు సమ్మెను విరమించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. తమ సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ తెలంగాణ స్టేట్ టాక్సీ డ్రైవర్స్ జాక్ శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఉబర్ కొత్తగా ‘ఛిౌఝఝu్ట్ఛ’ పేరుతో ప్రారంభించిన సేవలను హైదరాబాద్‌లో అనుమతించరాదని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబ్ ఆపరేటర్లు, యాప్ ఆధారిత క్యాబ్ ఆపరేటర్ల నియంత్రణకు మార్గదర్శకాలు తేవాల్సి ఉందని జాక్.. తమిళిసైకి తెలియజేసింది. టాక్సీ డ్రైవర్ల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తానని, ప్రజలకు మరింత అసౌకర్యం కలగకుండా వెంటనే సమ్మె విరమించాలని డ్రైవర్లకు గవర్నర్ సూచించారు. బంద్‌తో ఆసుపత్రుల్లో తగ్గిన ఔట్ పేషెంట్లు ఆర్టీసీ సమ్మెలో భాగంగా తలపెట్టిన రాష్ట్ర బంద్ ప్రభావం ఆసుపత్రులపై పడింది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఆసుపత్రులకు వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్య సగానికి సగం తగ్గింది. వివిధ జిల్లాల నుంచి బస్సులు తిరగకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య దాదాపు 50 నుంచి 70 శాతం తగ్గినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి రోజువారీ 2 వేల వరకు ఓపీ నమోదు కాగా శనివారం మాత్రం దాదాపు 900 మాత్రమే ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. గాంధీ ఆసుపత్రికి రోజువారీ 2,500 వరకు ఓపీ ఉండాల్సి ఉంటే, అందులో 60 శాతం మేర రోగులు తగ్గినట్లు సమాచారం. అత్యవసర రోగులు మాత్రమే ఏదో ఓ ఏర్పాటు చేసుకొని ఆసుపత్రులకు వచ్చారు. జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో దాదాపు 70 శాతం మేర ఔట్ పేషెంట్లు తగ్గినట్లు అధికారులు అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో ఆసుపత్రుల్లోని సిబ్బంది కూడా సమ్మెకు మద్దతు ప్రకటించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడంతో వైద్య సేవలు స్తంభించాయి. ఆర్టీసీ సమ్మెపై 25న ఎన్సీబీసీలో విచారణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) స్పందించింది. ఈ నెల 25న జాతీయ బీసీ కమిషన్ ముందు పూర్తి నివేదికతో హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. సమ్మె చేస్తున్న వారు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు ప్రభుత్వం పేర్కొనడంతో దాదాపు 20వేల బీసీ కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పలువురు ఎన్‌సీబీసీని ఆశ్రయించారు. కమిషన్ సభ్యుడు ఆచారి తల్లోజు ఈ ఫిర్యాదును పరిశీలించి విచారణకు స్వీక రించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, కేసుకు సంబంధించిన ఫైళ్లు, డైరీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దిష్టిబొమ్మల దహనానికి వామపక్షాల పిలుపు ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న ప్రజలను అరెస్టు చేయడంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తూ తీవ్ర నిర్బంధానికి గురి చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల భేటీ జరిగింది. సమావేశంలో తమ్మినేని వీరభద్రం, వెంకట్ (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి, బాలమల్లేశ్ (సీపీఐ), రమ, సూర్యం (న్యూ డెమోక్రసీ), సాధినేని వెంకటేశ్వర్లు, గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ), సుధాకర్ (ఎంసీపీఐ) తదతరులు పాల్గొన్నారు. మొండి వైఖరిని విడనాడి ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. -
నేడు సర్వం బంద్
– 12 కార్మిక సంఘాల పిలుపు – బస్సు, ఆటోలు బంద్ – దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : సార్వత్రిక సమ్మె నేపథ్యంలో శుక్రవారం జిల్లాలో సర్వం బందు కానుంది. బస్సులు, ఆటోలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, విద్యుత్ కార్మికులు, దుకాణాల్లో పనిచేసే కార్మికులు, టైలర్ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, రైస్‌మిల్స్, ఆయిల్ మిల్స్ కార్మికులు, వివిధ ట్రాన్స్‌పోర్టు రవాణా వ్యవస్థలు సమ్మెలో పాల్గొనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయనున్నారు. 12 కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. రైల్వే కార్మికులు, ఉద్యోగులు మినహా మిగిలిన అన్ని విభాగాల కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షలకుపైగా వివిధ రంగాల కార్మికులు సమ్మెలో ప్రత్యేక్షంగా పాల్గొననున్నారు. వీరితోపాటు సుమారు 20వేల మంది బీడీ కార్మికులు పాల్గొంటున్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, టీఎఫ్‌టీయూ సంఘాలు సమ్మెలో పాల్గొంటాయి. బస్సులు, ఆటోలు బంద్ సమ్మెలో భాగంగా ఆర్టీసీ బస్సులతోపాటు ఆటోలు బంద్ కానున్నాయి. రోడ్టు ట్రాన్స్‌పోర్టు, రోడ్డు భద్రత బిల్లుకు వ్యతిరేకంగా ఆర్టీసీ, ఆటో కార్మికులు సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. ఈ బిల్లుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతో జిల్లాలో 8డిపోల్లో 840 బస్సులు రోడ్డెక్కడం లేదు. మోటారు, వాహన చట్టంతో కఠినమైన నిర్ణయాలు అమలులోకి రానున్నట్లు తెలిపారు. ప్రమాదాలకు కారణమైన వారి లైసెన్స్‌లు రద్దు, భారీ జరిమాన వంటి నిర్ణయాలను రానున్న కొత్త చట్టంలో పొందుపరచనున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తు ఆటోలు బంద్ పాటిస్తున్నాయి. సమ్మెపై ఐదు రోజులుగా పట్టణంలో ప్రచారం నిర్వహించారు. అమలుకు నోచుకోవడం లేదు ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలు ఏ ఒక్కటి అమలుకు నోచుకోవడం లేదు. రూ.18వేల వేతన చట్టం అమలు కావడం లేదు. రైస్, ఆయిల్ మిల్ కార్మికుల ఎలాంటి ఉద్యోగ భద్రత, కనీస వేతన చట్టాలు అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త కార్మిక చట్టం వల్ల కార్మికుల హక్కులు హరించుకుపోతాయి. – సి. వెంకటేశ్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కనీస వేతనం అమలు చేయాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి రూ.18వేల కనీస వేతనం అమలు చేయాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఎక్కడ అమలు కావడం లేదు. దాన్ని అమలు చేయాలి. అసంఘటిత రంగం, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. – కొండన్న, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కార్మికుల డిమాండ్లు – నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించి ఆదుపులో పెట్టాలి. – కనీస వేతనం నెలకు రూ. 18 వేలుగా నిర్ణయించాలి. – కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, వారిని రెగ్యులరైజ్ చేయాలి. – సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. – అసంఘటిత రంగం, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. – కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. – కార్మిక చట్టాల సవరణను ఆపి ఉన్న వాటిని పకడ్బందీగా అమలు చేయాలి. – కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఆమ్మకాన్ని ఆపాలి. – రక్షణ , రైల్వే, బ్యాంక్ ఇన్సురెన్స్ రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించరాదు. – రోడ్డు ట్రాన్స్‌పోర్డు, విద్యుత్ చట్టసవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలి. – కార్పొరేట్లకి అనుకూలంగా తెచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి. – పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ చట్టాలు విధిగా అమలు చేయాలి. – అర్హులైన కార్మికులకు పింఛన్ ఇవ్వాలి. – 45 రోజుల్లోగా కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.