
సిరిసిల్ల: ఆరు గ్యారంటీలను మరిచిపోయేందుకు హైడ్రా తెచ్చారని, ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట, సిరిసిల్లలో గురువారం పర్యటించిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జన్వాడ ఫామ్‌హౌ స్ నిర్మాణం కూల్చివేతలో రేవంత్ రోషం ఏమైందని ప్రశ్నించారు.
సల్కం చెరువు ఆక్రమణలపై ఒవైసీ బెదిరిస్తే భయపడతావా? అని ముఖ్యమంత్రిని బండి ప్రశ్నించారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఒవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని చెప్పారు. రైతు రుణమాఫీ బోగస్ అని, రైతు భరోసా లేదని, మహిళలను ప్రభుత్వం ఆదుకోలేదని, నోటిఫికేషన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు యువరాజు అమెరికా వెళ్లాడని, ఆయన్ని కలిసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారని, ఆ రెండు పార్టీల విలీనం ఖరారు అయిందన్నారు.
ప్రభుత్వ విధానాలతో నేతన్నలు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా దాట వేస్తోందన్నారు . రూ.లక్షల విద్యుత్ బకాయిలతో నేతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ సమస్యకు పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని బండి సంజయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment