సిరిసిల్ల జిల్లా కోసం రోజురోజుకూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో రగుడు బ్రిడ్జి వద్ద శనివారం రాస్తారోకో నిర్వహించారు. మంత్రి కేటీఆర్ మౌనం వీడాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
-
మంత్రి కేటీఆర్ కనిపించడం లేదని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కోసం రోజురోజుకూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో రగుడు బ్రిడ్జి వద్ద శనివారం రాస్తారోకో నిర్వహించారు. మంత్రి కేటీఆర్ మౌనం వీడాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో కరీంనగర్–కామారెడ్డి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళన కారులను సముదాయించారు. కార్యక్రమంలో నాయకులు కత్తెర దేవదాస్, సంగీతం శ్రీనివాస్, రాగుల రాములు, బుస్సా వేణు, జక్కుల యాదగిరి, చొక్కాల రాము, శ్రీనివాస్‌రావు, పంతం రవి, ఎండీ సత్తార్, రొడ్డ రామచంద్రం, కంసాల మల్లేశం, మనోజ్, రమేశ్, దశరథం తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్‌పై బీజేవైఎం ఫిర్యాదు
సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారకరామారావు కనిపించడం లేదని బీజేవైఎం ఆధ్వర్యంలో సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. నాయకులు అన్నల్‌దాస్ వేణు, గౌడ వాసు, నరేశ్, శ్రీధర్, పవన్, శ్యామ్, సురేశ్ సిరిసిల్ల టౌన్ ఎస్సై బి.శ్రీనివాస్‌గౌడ్‌కు ఫిర్యాదు అందించారు.
స్కూల్ బోర్డుపై సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల శివనగర్‌లోని కుసుమ రామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాల బోర్డుపై ఆందోళనకారులు సిరిసిల్ల జిల్లా అని రాసిన కాగితాలను అతికించారు. కోర్టు ఎదుట న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షల్లో జె.శ్రీనివాసరావు, దాసరి శ్రీధర్, కోడి లక్ష్మణ్, డి.జనార్థన్‌రెడ్డి, కేసరి శ్రీనివాస్, మునిగె యాదగిరి, ఇల్లందుల రమేశ్ పాల్గొన్నారు. ఆవునూరి రమాకాంత్‌రావు, శాంతిప్రకాశ్‌శుక్లా, ప్రకాశం, సంఘీభావం తెలిపారు.